ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రైతుల ఆందోళనల నేపథ్యంలో మందడం గ్రామంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సచివాలయానికి వస్తుండటంతో గ్రామంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ధర్నాలు, నిరసనలకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. మెయిన్ సెంటర్‌తో పాటు గల్లీల్లో ఉన్న షాపులను సైతం పోలీసులు మూయించేస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోనివ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అనుమతి విషయంపై ఆలోచిస్తామంటూ చెప్తున్నా పోలీసులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.