ఓవైపు జర్నలిస్ట్‌ల అరెస్ట్‌లు, ప్రభుత్వంలో జరుగుతోన్న అవినీతిని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి… ప్రెస్ క్లబ్‌పై నిఘాను మరింత పెంచింది. సాధారణంగా ప్రెస్ క్లబ్ లోపలికి పోలీస్ వాహనాలకు అనుమతి ఉండదు. నిఘాకూ నిబంధనలు ఒప్పుకోవు. ఒకవేళ వస్తే… ప్రెస్ ఫ్రీడమ్‌ను హరించినట్లే.
కానీ, ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత దోరణిపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో… అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు, సామాజిక సంఘాల నేతలు, జర్నలిస్ట్‌లు పెద్ద ఎత్తున హజరయ్యారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అయితే, ప్రెస్ క్లబ్‌లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కలుస్తున్నారు… అన్న అంశాలపై పోలీస్ నిఘా యంత్రాలు ప్రెస్ క్లబ్ లోపలికి వచ్చేశాయి. వీడియోలు, ఫోటోలు తీసే వాహానాలను ప్రత్యేకంగా రప్పించారు పోలీస్ అధికారులు.
బయట సమావేశాలకు ఎలాగు ఒప్పుకోరు… కనీసం స్వేచ్ఛ ఉండే ప్రెస్‌క్లబ్‌లో కూడా ఇదే పరిస్థితా…? అంటూ జర్నలిస్టులు, మేధావులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.