కరోనా కేసుల పెరుగుదలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుండటంతో… రాబోయే హోళీ పండుగపై ఆంక్షలు విధిస్తున్నారు. హోళీ ఆడుతూ జనం గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.
ఇప్పటికే హైదరాబాద్ జంటనగరాల పరిధిలో హోళీ సందర్భంగా వైన్సులు, బార్లు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు ఈ బంద్ కొనసాగనుండగా… ఇప్పుడు హోళీ సెలబ్రేషన్స్ పై ఫోకస్ పెట్టారు.
రిసార్టులు, గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రత్యేక సెలబ్రేషన్లు నిర్వహించరాదని… నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోళీ ఆడే సందర్భంగా జనం గుమికూడవద్దని, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
హోళీ పండుగ పెద్ద ఎత్తున చేసే ఉత్తర భారతదేశంలోనూ కోవిడ్ దృష్ట్యా… ఈసారి పలు ఆంక్షలు విధించారు.