ఏదో ఒక అంశం తో కాంట్రవర్సీ చేయడం రాంగోపాల్ వర్మ కు మొదటి నుంచి అలవాటు. లాక్ డాన్ సమయంలో కూడా వరుస సినిమాలను చేస్తూ వాటిని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు వర్మ. వర్మ ప్రస్తుతం మిర్యాలగూడ అమృత ప్రణయ్ జీవితకథ ఆధారంగా మర్డర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించి కోర్టులో వాదోపవాదనలు జరిగిన తర్వాత సినిమా రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ నెల 24న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ లో వర్మ ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రెస్ మీట్ ను వర్మ రద్దు చేసుకున్నాడు. కానీ తరువాత అయినా తప్పకుండా మిర్యాలగూడ కు వస్తానని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు.
Since we are not given permission for MURDER press meet at Natraj theatre in Miriyalaguda we are cancelling for the moment ..But will surely come later ..I thank the S P Garu for his co operation pic.twitter.com/hYx7yrP82U
— Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2020
Advertisements