ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. పైగా ఐజీ ర్యాంకు స్థాయిలో పనిచేస్తున్నారు. కానీ సడన్ గా ఆమె కనిపించటం లేదని, ఆచూకీ తెలపాలంటూ పేపర్ లో ఒక ప్రకటన వచ్చింది. దీంతో అంతా ఆమెకు ఎమైంది…? ఎవరైనా ఏమైనా చేశారా…? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
నిజానికి ఆమె కనపడకుండా రెండు సంవత్సరాలు అవుతుంది. అవును… రెండు సంవత్సరాలుగా ఆమె ఉద్యోగానికే రావటం లేదు. కనీసం సెలవు కూడా పెట్టలేదు సరికదా అధికారులకు మాట మాత్రం కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. ఆఫీసు నుండి పెట్టిన లెటర్స్ రిటర్న్ అవుతుండగా, మెయిల్స్ కు నో రిప్లై. ఆమె శాఖలో ఓవైపు ఫైల్స్ అన్నీ పెండింగ్. దీంతో ఆమె ఆచూకీ తెలపాలంటూ పోలీసు డిపార్ట్మెంట్ ఏకంగా పేపర్ ప్రకటన ఇచ్చింది.
ఇదంతా ఒడిశా రాష్ట్రంలోని కటక్ లో జరిగింది.