పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం రాధేశ్యామ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేయగా ఫ్యాన్స్ భారీగా వచ్చారు. జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది.
అటు.. కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కారు అభిమానులు. ఆ సమయంలో కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.