హైదరాబాద్ నగరం అక్రమ దందాలకు అడ్డాగా మారింది. అంతే స్పీడ్ గా దందాలను అరికట్టేందుకు పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపిన నగర పోలీసులు అనేక అనేక మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.
తాజాగా.. అబిడ్స్ సనాలి మాల్ లోని హుక్కా సెంటర్ పై పోలీసులు దాడులు చేశారు. హుక్కా పాట్స్, టొబాకో, హుక్కా ఫేల్వోర్స్ తో తోపాటు.. లక్షా 13వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
హుక్కా సెంటర్ యాజమాని హబీద్ అహ్మద్ తోపాటు.. సిబ్బంది పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.