హైదరాబాద్ శివారులోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్ హౌస్ లపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ వోటీ పోటీసులు 32 ఫామ్ హౌసుల్లో తనిఖీలు నిర్వహించారు.
నాలుగు ఫామ్ హౌసుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ లోని బిగ్ బాస్ ఫామ్ హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిప్లేజ్ ఫామ్ హౌస్, మేడ్చల్ లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు పోలీసులు.
దాడులు నిర్వహించిన ఫామ్ హౌసుల్లో భారీగా మద్యం బాటిల్లు, హుక్కా సామాగ్రి,ప్లేయింగ్ కార్డ్స్, రూ.3 లక్షల నగదు, 7 మొబైల్స్ తో పాటు 23 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.