శుక్రవారం రాత్రి మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమయంలో తేజ్ మధ్యం సేవించాడన్న వార్తలను మాదాపూర్ ఏసీపీ స్పందించారు. ప్రమాద సమయంలో తను మద్యం సేవించలేదని, హెల్మెట్ కూడా పెట్టుకున్నారన్నారు. హెల్మెట్ పెట్టుకోకుంటే ప్రమాద తీవ్రత ఊహించని విధంగా ఉండేదన్నారు.
ప్రమాద సమయంలో రోడ్డుపై ఇసుక ఉండటంతోనే బైక్ స్కిడ్ అయ్యిందని, బైక్ ను తేజ్ కంట్రోల్ చేయలేక కిందపడిపోయారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ కు కాలర్ బోన్ విరిగిందని వైద్యులు ప్రకటించారు. శరీరంలో అంతర్గతంగా ఎక్కడా గాయాలు లేవన్నారు. 48గంటల పర్యవేక్షణలో తేజ్ ఉన్నాడని, ఆ తర్వాత జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు.