మంజీరా ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు సొంత పూచీకత్తుపై విడుదలయ్యారు. సంగారెడ్డి జిల్లా భానూర్ పోలీస్ స్టేషన్ నుండి ఉత్తమ్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు సొంతపూచీకత్తుపై విడుదలయ్యారు.
మంజీరా, సింగూరు ప్రాజెక్టులను పునర్జీవం తెస్తామని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు హామీలు ఇచ్చారని, సీఎం ఆదేశాలతో తమను అరెస్ట్ చేశారని ఉత్తమ్ ఆరోపించారు. అసలు మమ్మల్ని ఏ సెక్షన్, ఏ చట్టంపై అరెస్టు చేశారో డీజీపీ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సీఎం ఆదేశాల మేరకు తమను అక్రమంగా అరెస్ట్ చేశారని, తాము ప్రాజెక్టుల వద్దకు వెళ్తే వీరికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
మీరు ఐపీఎస్ అధికారులు, కల్వకుంట్ల ప్రైవేటు సైన్యం కాదని ఉత్తమ్ ఘాటుగా విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను ఓపెన్ చేసేందుకు వెళ్తే తప్పులేనిది, తాము పరిశీలనకు వెళ్తే తప్పేలా అవుతందని ప్రశ్నించారు.