ఈరోజు భారీ వర్షాల వల్ల, హిమాయత్ సాగర్ జలాశయం యొక్క 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. తద్వారా నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డుకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అయితే దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి వరదల్లో చిక్కుకుపోగా హైదరాబాద్ పోలీసులు అతడిని కాపాడి సలామ్ అనిపించుకున్నారు. విధుల్లో భాగంగా వరదల్లో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడి అందరి మన్ననలు అందుకుంటున్నారు.
భారీ వర్షాల కారణంగా ఈరోజు హిమాయత్ సాగర్ జలాశయం 4 గేట్లు ఎత్తడంతో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీఎస్‌పీఏ నుంచి రాజేంద్ర నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డుకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే సుమారు 4:45 గంటల సమయంలో ఒకరు బైక్‌పై కలీజ్ ఖాన్ దర్గా నుండి శంషాబాద్ వైపు బయలుదేరాడు. ఇందుకోసం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ వంతెనను బారికేడ్లు ఉన్నప్పటికీ దాటేందుకు ప్రయత్నించాడు.
అయితే అప్పటికే వర్షపు నీరు రోడ్డుపైకి భారీగా చేరిడంతో ఆ వరద ఉధృతిలో కలీజ్ ఖాన్ కొట్టుకుపోయాడు. ఈ సమయంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పొలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బేగ్ నేతృత్వంలోని రికవరీ వ్యాన్ బృందం వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో బాధితుడిని తాడు సహాయంతో సురక్షితంగా పైకి లాగింది.
కాగా, తమకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించిన హెడ్ కానిస్టేబుల్ బేగ్ బృందంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.