భర్తతో గొడవ పడి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో వెళ్లిపోగా.. స్థానిక పోలీసులు 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లిలోని ఇందిరానగర్ కు చెందిన గుర్రు అరుణ అనే గృహిణి భర్తతో గొడవపడి గురువారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఎవరికి చెప్పకుండా తన ముగ్గురు పిల్లలు రితిక్, సహశ్రీ, ప్రతిక్ లను తీసుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయింది.
భర్త గుర్రు నరేష్ ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోయే సరికి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల్లోనే మిస్సింగ్ అయిన అరుణ ముగ్గురు పిల్లల ఆచూకీని కనిపెట్టారు.
శుక్రవారం వారిని పట్టుకుని భర్త నరేష్ కు అప్పగించినట్లు ఎస్ ఐ తెలిపారు. కేవలం ఒక్క రోజులోనే మిస్సింగ్ కేసును చేధించడంతో పోలీసులను అభినందించారు పట్టణ వాసులు.