మంథనిలో లాయర్లు వామన్ రావు ఆయన సతీమణి నాగమణిలను దారుణ హత్యపై పోలీసులు స్పందించారు. దాడి వెనుక టీఆర్ఎస్ కీలక నేతలున్నారని ఆరోపణలు వస్తుండగా… హత్యకు కుంట శ్రీనివాస్ తో ఉన్న గుడి, స్థలం వివాదాలే కారణమని పోలీసులు తేల్చారు.
వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని… కోర్టుల ద్వారా వామనరావు తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంపడుతున్నారన్న కారణంతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దేవాలయ స్థల వివాదం, శ్రీను నివాస నిర్మాణంపై వివాదాలున్నట్లు బుధవారం నుండి ప్రచారంలో ఉన్న మాటలే పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తికాలేదని…నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను పోలీసులకు అందిస్తే తాము పరిశీలిస్తామని వెల్లడించారు.
గుడి వివాదంతో కేసును పక్కదారి పట్టిస్తారన్న తమ మాటలే నిజమవుతున్నాయని, కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని లాయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.