హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల పాపకు చిప్స్ ఆశ చూపి ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఆ పాపను అత్యాచారం చేసి ఆపై గొంతునులిమి హత్య చేశాడు. పాప కోసం తల్లితండ్రులు వెతగ్గా… పక్కింట్లోనే చిన్నారి మృతదేహం లభ్యమైంది.
అయితే, చిన్నారి అంత్యక్రియల సందర్భంగా పోలీసుల తీరుపై ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకోకుండా తమపై జులుం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, బాలిక కుటుంబాన్ని కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. ఆ కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని, డబుల్ బెడ్ రూం ఇవ్వటంతో పాటు మిలిగిన చిన్నారులకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు.
నిందితుడిని త్వరలోనే పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.