నేను ఎవర్నీ మోసం చేయాలని కాదు, నేను బతుకుతానో లేదో తెలియదు, నాకు చావు తప్ప వేరే మార్గం లేదు… నన్ను క్షమించండి అంటూ నోటి నుండి నురగలు కక్కుతూ వీడియో తీసి ఓ యువకుడు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కర్నూల్‌కు చెందిన జంగం విశాల్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఆర్థికంగా అప్పుల పాలయ్యాడు.
మనస్థాపం చెందిన అతడు అన్నకు సూసైడ్ చేసుకుంటూ వీడియో పంపాడు. కర్నూల్ నుండి అనంతపురంకు బైక్‌పై వెళ్తూ గుత్తి మండలం కొత్తపేట వద్ద ఆగి, పురుగుల మందు తాగాడు. వీడియోను చూసిన అన్న నందు షాక్‌కు గురై… వెంటనే గూగుల్‌లో గుత్తి సీఐ నెంబర్ వెతికాడు. ఆ నెంబర్ వాట్సాప్‌కు విశాల్ వీడియోలు పంపి… సేవ్ చేయాలని ప్రాధేయపడ్డాడు.
వెంటనే సీఐ రంగంలోకి దిగి కొత్తపేట శివారులో గాలింపు చర్యలు చేపట్టగా ఆపస్మారక స్థితిలో ఉన్న విశాల్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌కు షిఫ్ట్ చేయగా… విశాల్ ప్రాణపాయం నుండి బయటపడ్డాడు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన సీఐ రాజశేఖర్‌రెడ్డికి ప్రశంసలు అందుతున్నాయి.