టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్టులు బయట పడుతున్నాయి. తాజాగా ఈ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా శనివారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి నేరం జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్ ను నిందితుల సమక్షంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రస్ లు మార్చి కంప్యూటర్ లోకి ఎలా చొరబడ్డారనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఐపీ అడ్రస్ ఎలా మార్చారని విషయాన్ని పోలీసులకు నిందితుడు రాజశేఖర్ రెడ్డి చూపించాడు.
కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ పాస్ వర్డ్ లను శంకర్ లక్ష్మి డైరీలో నుంచి దొంగిలిచినట్లు పోలీసులకు ప్రవీణ్ చెప్పాడు. అయితే పాస్ వర్డ్ లను డైరీలో ఎక్కడ కూడా రాయలేదని శంకర్ లక్ష్మీ పోలీసులకు చెప్పారు. దీంతో రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రస్ లను మార్చి కంప్యూటర్ లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 27వ తేదీన ఏఈ పరీక్ష పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పత్రాలను కాపీ చేసినట్లు పోలీసులకు నిందితుడు ప్రవీణ్ చెప్పాడు. అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలను కూడా ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు లీక్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీ కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నిడిపించినట్లు పోలీసులు తేల్చారు.