విరాట్ కోహ్లి భార్య‌కు పోలీసుల నోటీసులు - Tolivelugu

విరాట్ కోహ్లి భార్య‌కు పోలీసుల నోటీసులు

ప్ర‌పంచంలో మేటి క్రికెట‌ర్ కోహ్లి సతీమ‌ణి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌కు పోలీసులు నోటీసులివ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది. స్వ‌త‌హాగా న‌టి అయిన‌ప్ప‌టికీ వెబ్ సిరీస్ కోసం నిర్మాత‌గా మారింది అనుష్క‌. ఇటీవ‌లే అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయిన ప‌తాల్ లోక్ అనె వెబ్ సిరీస్ కు కో ప్రొడ్యూస‌ర్ గా ఉన్నారు అనుష్క‌.

ప‌తాల్ లోక్ లో నేపాల్ క‌మ్యూనిటీని కించ‌ప‌ర్చేవిధంగా కొన్ని స‌న్నివేశాలున్నాయ‌ని, 18న రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ సెకండ్ ఎపిసోడ్ పై త‌మ‌కు అభ్యంత‌రం ఉంద‌ని గోర్ఖా క‌మ్యూనిటి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నేపాలిల‌పై విద్వేశాల‌ను రెచ్చ‌గొట్టేలా వెబ్ సిరీస్ నిర్మాత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసులకు ఫిర్యాదు అంద‌టంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp