ఓ హోటల్‌లో రూం బుక్ చేసుకోవాలంటే… రివ్యూ చదువుతాం. రేటింగ్ చూస్తాం… కారణం అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లకు కూడా రివ్యూలు వచ్చేస్తున్నాయి. అవును… పోలీస్‌స్టేషన్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటీ…? అనే విషయలతో రాసిన ఓ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్ ప్రకారం.. నేను నా ఐడెంటిటీ కార్డు లేనందుకు అరెస్ట్ అయ్యాను, కానీ నన్ను అక్కడ బాగా చూసుకున్నారు. అరెస్ట్ చేసి ఉంచిన సెల్ బాగుంది. ఫుడ్ పర్వాలేదు కానీ మూడు సార్లే అన్నం పెట్టడమే కాస్త బోరింగ్ అనిపించింది, ఆఫీసర్స్ ఫ్రెండ్లీగా ఉన్నారు… ఓవరాల్‌గా మంచి అనుభవం అంటూ పోస్ట్ చేశారు.
దీంతో ఎక్కడా పోలీస్ స్టేషన్… అత్తగారింట్లో జరిగిన రాచమర్యదలు జరిగినట్లున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడుందని చూస్తే… శ్రీలంకలో ఓ పోలీస్ స్టేషన్‌కు రాసిన రివ్యూ ఇది.