పశ్చిమ బెంగాల్ రాజకీయం రోజు రోజుకి మరింత రసవత్తరంగా మారుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా బెంగాల్ బీజేపీ నేతలకు ప్రశాంత్ కిశోర్ మరో ఛాలెంజ్ విసిరారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లు గెలుచుకోవడంలో విఫలమైతే..ఆ పార్టీ నేతలు తాము పదవుల నుంచి తప్పుకుంటామని ఆన్‌రికార్డ్ చెప్పాలంటూ సవాల్ విసిరారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదన్న ప్రశాంత్ కిశోర్.. అదే జరిగితే తాను ట్విట్టర్ నుంచి వైదొలుగుతానంటూ ఛాలెంజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ప్రశాంత్ కిశోర్ ట్వీట్‌పై బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఓ ఎన్నికల వ్యూహకర్త కథ కంచికి వెళ్తుందని సెటైర్ వేసింది. దీనికి బదులుగా ప్రశాంత్ కిశోర్ తాజా సవాల్ విసిరారు.