• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఈ సిగ్గులేని జాతికి అటువంటి మహనీయులు ఎందుకు గుర్తుంటారు…..?

Published on : May 21, 2020 at 2:02 pm

సువేరా

శాలువా నాకేందుకు ? ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీశే టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి నిన్న మే 20 వతేదీ రోజున.

ఈ తారీఖు / ఆ మహానుభావుడు మనలో ఎంతమందికి గుర్తున్నట్లు ?

మనకు కావాల్సింది నేడు ఎవడు అధికారంలో ఉన్నాడో వాడే కావాలి, లేదా వాడి వారసులు, వాళ్ళ కుటుంబాల భజనలు కావాలి, పోరంబోకు వికారపు సినీనటులు కావాలి, వాళ్ళ భజనలుచేయాలి…. అంతేగా..!

మొన్నటి నుండే……అంటే మేనేల 18 వతేదీ నుండే మన కిరాయి తెలుగు మీడియా మొత్తం మరియు మెజారిటీ తెలుగు సైకో యువత మేనేల 20 వతేదీన ఏ సినీనటుడు పుట్టాడు, ఏ సినీనటుడు ఏయువతిని ప్రేమించాడు, వాళ్ళ నిశ్చితార్థం ఎక్కడ ? అనే పోరంబోకు అంశాల మీద వార్తలు పోస్టులు అభినందనలు పరమపరతో సమాజాన్ని కాలుష్యం చేసేసారు.

ఒకవేళ…నిన్న పుట్టినరోజులు జరువుకున్నటువంటి సినీ నటులు (వీరోలు అంట) ఆ ప్రకాశంపంతులు మహానీయుడిని గుర్తుపెట్టుకొని ఏమన్నా వాళ్ళ అభిమానులకు గుర్తుచేసారా ? అదేమీలేదు.

పోనీ, వాళ్ళ పుట్టినరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీల వేసవి ఎండలో వడగాల్పుల్లో చెప్పులులేకుండా తారురోడ్లమీద వందలవేల కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళ స్వస్థలాలకు వెళుతున్న అభాగ్యులకు నిర్భాగ్యులకు కనీసం మంచినీళ్లు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ మచ్చుకు కూడా మనకు కానరావు.

కానీ, మనపిల్లలకు అటువంటి మహనీయులు చరిత్రలను మనంచెప్పం, మనకు ఆదర్శం మనం మన పిల్లలకు చెప్పేది దేశాన్ని దోచుకుని అక్రమాలతో లక్షలకోట్ల సంపాదించే దొంగ పారిశ్రామికవేత్తలు దొంగలు దేశద్రోహులు అయినటువంటి బందిపోటుల్లాంటి రాజకీయనాయకులు వాళ్ళ దోపిడీ వారసులు, చిల్లర సినీనటులు వాళ్ళ కుక్కమూతిపిందెలు లాంటి వారసులు వాళ్ళ జీవితాలనే నేడు మనం ఆదర్శంగా తీసుకుంటూ వాళ్లనే మన పిల్లలకు రోల్ మోడల్స్ గా చెబుతాం, కాస్ట్లీ ఫైవ్ స్టార్ దళారీ కాషాయంబరధారులు దొంగ స్వామీజీలు బురిడీ బాబాలు, బ్రతుకుదేరువు పెట్టుడు పీఠాధిపతులు, పరాన్నజీవులైన అర్ధజ్ఞాన ప్రవచనకారులు మనకు పూజ్యనీయులు…..మనకే సిగ్గుఎగ్గూ సంస్కారం లేదు, ఇక మన పిల్లలకు అవన్నీ ఎందుకుంటాయి ?

కీశే టంగుటూరు ప్రకాశంపంతులు గారి జీవిత ఘట్టాలలో కొన్ని క్లుప్తంగా…???

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుర్రాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక, వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు. తీరాచేసి బావగారింటికి వెడితే ‘నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా’అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు.

ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది.ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి,అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో , కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.

గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు.తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చందంగా జైలుశిక్షను అనుభవించాడు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు. సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా,ముఖ్యమంత్రి గా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు (1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.

రాయలసీమ దురాశాపరులు కుట్రదారులు అధికారవ్యామోహపరులు మూలంగానూ, శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు. కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.

బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్ ను బాగుచేయించి నిలబెట్టాడు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు. అందుకే ప్రజలందరూ ఆ బరాజ్ ను ఆయన పేరునే ప్రకాశం బారేజ్ గా పిలుచుకుంటున్నారు.రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు. అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ననుభవించాడు.తనను శాలువతో సత్కరిస్తే ‘ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!’ అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పై లోకాలకు తీసుకుపోయిన తెలుగుజాతికి ప్రాతఃస్మరణీయుడు నిస్వార్ధజీవి “ఆంధ్రకేసరి”టంగుటూరి ప్రకాశం పంతులు గారికి శ్రద్ధాంజలి ????

(ఈ పోస్టు ఎవరికైనా బాధకలిగిస్తే… బాధపెడుతున్న ప్రదేశంలో సైబాల్ రాసుకోండి.)

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

తలైవి రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ షూట్ స్టార్ట్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

చైనా దురాక్ర‌మ‌ణ‌పై జేపీ న‌డ్డా వ‌ర్సెస్ రాహుల్ గాంధీ

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

ఇప్ప‌టికీ పేద దేశాల‌కు అందిన వ్యాక్సిన్లు 25 మాత్ర‌మే!

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

భార‌త్ బ‌యోటెక్ కోవాక్జిన్ కు మ‌రో 45ల‌క్ష‌ల డోసుల ఆర్డ‌ర్

high tension at huzur nagar

ధాన్యం కొనుగోలు చెయ్యనప్పుడు ప్రభుత్వం ఎందుకు ?

Revanth reddy In GHMC Elections campaign

గల్లీ లో కుస్తీలు… ఢిల్లీ లో దోస్తిలా ?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)