ఓట్లే కాదు... ఉద్యమాలూ ప్రామాణికమే! - Tolivelugu

ఓట్లే కాదు… ఉద్యమాలూ ప్రామాణికమే!

ఎన్నికలలో గెలుపే ప్రజల నాడికి ప్రామాణికం కాదు ఉద్యమాలు కూడా ప్రామాణికమే. ఎన్నికల్లో గెలుపు ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని ప్రజలు మాతోనే ఉన్నారు అనుకుంటే పొరపాటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  కేసీఅర్ ప్రజలు మాతోనే ఉంటారు నాతోనే ఉంటారు నామాటే వింటారు అనుకుంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో గెలవడంతో నాకు తిరుగులేదు అనుకున్నా దానితో ఆర్టీసీ కార్మికులను చెడుగుడు ఆడుకోవచ్చు అని భావించారని చెప్పుకొస్తున్నారు.   అందుకే ఆర్టీసీ కార్మికులకు డెడ్ లైన్ పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

తనమాట వినకపోతే ఆర్టీసీని మూసేస్త మీకు భవిష్యత్ ఉండదు అని హెచ్చరికలు చేస్తున్నాడని అంటున్నారు  అయితే కార్మికులు ఈ హెచ్చరికలు లెక్క చేయలేదు. మొండి పట్టుదలతో సమ్మెను కొనసాగిస్తున్నారు. రోజు రోజుకు వీరికి ప్రజల మద్దతు పెరుగుతోంది. కార్మికులకు అండగా డాక్టర్స్ ఉచితంగా  వైద్యం చేస్తామని ముందుకొస్తున్నారు. మరోవైపు కొందరు తమ ఇళ్లలో అద్దెకు ఉండే కార్మికుల దగ్గర సమ్మె కాలంలో రెంట్ తీసుకోమని ప్రకటిస్తున్నారు. రిటైర్ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చి బియ్యం పప్పు ఉప్పు తోపాటు సరుకులను అందిస్తున్నారు. కొంతమంది ఆర్థిక సహాయం చేసి ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా అన్ని వర్గాలు ఆర్టీసీ సమ్మెకు బాసటగా నిలుస్తున్నాయి.

అయినా కేసీఅర్ ఇవేమీ పట్టించుకోడంలేదు. తానుఅనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు అని చెప్పుకొస్తునారు. ఉప ఎన్నికలలో గెలవడం ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవడంతో కరెక్ట్ కాదు అని విశ్లేషకులు అంటున్నారు. అలా అలోచించి నిర్ణయాలు తీసుకుంటే కేసీఅర్ కు భవిష్యత్ లో కష్టాలు తప్పవంటున్నారు.  తాను అంత గట్టిగా ఒత్తిడి తెచ్చినా ఎంత బెదిరించినా కార్మికులు ఎందుకు లొంగలేదో అర్దం చేసుకోవాలి. దీనిని బట్టి ప్రజల మూడ్ ఎలా వుందో అర్దం అవుతుంది.  అలా కాకుండా డబ్బులతో ఓట్లు కొనుకుంటాను, డబ్బులతో ఎన్నికలలో విజయం సాధిస్తాను, డబ్బులలో మాతో పోటీపడే శక్తి ఎవరికీ లేదు, విపక్షాలకు నాయకత్వ కొరత ఉంది… మా సమీప భవిష్యత్తులో ఏ పార్టీ లేదు అనుకుని విర్రవీగితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని, అందుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నిదర్శనం అని చెప్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp