- త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా!
- స్టోరీ ప్రిపరేషన్ లో విజయేంద్ర ప్రసాద్
- కశ్మీర్ ఫైల్స్ సినిమా తరహాలో మరో మూవీ
- రజాకార్ల రాక్షసాకండను తెలిపేలా కథ
తెలుగు సినిమాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సభ్యత్వం లభించింది. రాజ్యసభకు నామినేట్ అయిన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో పటేల్ మాత్రమే ఎందుకు ఉన్నారు. గాంధీ, నెహ్రూ ఎందుకు లేరు అనే విషయం పై ఆయన వివరణ బీజేపీ నేతలకు నచ్చింది. దీంతో రజాకార్ ఫైల్స్ కథ విజయేంద్ర ప్రసాద్ తో రాయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్ బాగా భావోద్వేగాలను పెంచిందని.. ఆ తరహాలోనే సినిమా ఉండాలని బండి సంజయ్ భావిస్తున్నారు.
ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి కథను అందించిన తన సత్తా ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు ఈ స్టార్ రైటర్. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్ పేరును రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయనకు సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నేతలు కూడా విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ నెక్ట్స్ ప్రాజెక్టులు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు ముఖ్య కారణం ఆయన త్వరలో తెలంగాణలో జరిగిన రజాకార్ల అఘాయిత్యాలకు సంబంధంచి ‘రజాకార్ ఫైల్స్’ అనే సినిమా కథను రెడీ చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్.
అయితే తాజాగా ఈ స్టార్ రైటర్ ‘రజాకార్ ఫైల్స్’ కథ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కథను రెడీ చేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. కాగా, తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్‌లు కలిశారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన విజయేంద్ర ప్రసాద్ తో వారు మాట్లాడారు. ఈ క్రమంలో రజాకార్ ఫైల్స్ సినిమా గురించి బండి సంజయ్ ఆరా తీయగా, సినిమా కథ రెడీగా ఉందని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
మే నెలలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలుపగా.. జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేసేలా చూడాలని బండి సంజయ్ కోరగా.. తప్పకుండా ప్రయత్నిస్తానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ మరోసారి తెలంగాణలో జరిగిన రజాకార్ల అఘాయిత్యాలపై సినిమా చేస్తుండటంతో ఈ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగాను అటు రాజకీయాలకు మంచి టాపిక్ గాను మారిందని విశ్లేషకులు అంటున్నారు.
కశ్మీరీ పండిట్ల జీవితాలను తెరపైకి తెచ్చినట్లే… రజాకార్ల దారుణాలను ప్రజలకు చూపించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కశ్మీరీ ఫైల్స్ లాగే రజాకార్ల ఫైల్స్ ను తెరపైకి తీసుకొస్తామని… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నోసార్లు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన తర్వాత…అయితే కశ్మీర్ ఫైల్స్ సినిమా ఎంతో మందిని కంటతడి పెట్టింది. అలాగే విమర్శలు పాలు అయింది. మరి బండి సంజయ్ పోకస్ చేసి తీయించే ఈ సినమా ఏ తరహాలో వస్తుంది అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తిని నెలకొంది