బీఆర్ఎస్ పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని మనస్ఫూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు ఆంధ్రా వాళ్లను తిట్టారన్న విషయం తెలుసునని, ఆనాటి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలని సూచించారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో 26 ఉపకులాలను బీసీల లిస్ట్ నుంచి ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 26 ఉపకులాలను తొలగించినప్పుడు జనసేన పార్టీ మాత్రమే పోరాటం చేసిందని, ఏపీలోని వైసీపీ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడలేదని గుర్తు చేశారు.
26 కులాలను బీసీ జాబితా నుంచి ఎందుకు తొలగించారనే దానిపై బీఆర్ఎస్ తప్పనిసరిగా వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. బీసీలకు వైసీపీ, టీడీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.