పాలకుల ప్రవర్తనే సమాజాన్ని ప్రభావిత చేస్తుంది - Tolivelugu

పాలకుల ప్రవర్తనే సమాజాన్ని ప్రభావిత చేస్తుంది

నరసింహ, మహబూబ్‌నగర్

సమాజం సంకనాకిపోయింది, నైతిక విలువలు దిగజారాయి, మానవత్వం మంట కలిసింది. ప్రేమానురాగాలు కనుమరుగు అవుతున్నాయి. కక్ష, ప్రతీకారం, ద్వేషం, పగ పెరుగుతున్నాయి. పెద్ద, చిన్న అనే గౌరవ మర్యాదలు పోయాయి. సాంప్రదాయాలు, కట్టుబాట్లు పోయాయి. ఇలా సమాజంలో అనేక మార్పులు జరిగాయి, జరుగుతున్నాయి. దీనికి కారకులు, కారణం పాలకులే అని చెప్పక తప్పదు . దేశంలో పాలకులు అమలుచేస్తున్న ఆర్థిక, సామాజిక అంశాల మీద ఆధారపడే మన సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. అలాగే పాలకులు అదే రాజకీయ నాయకులు అనుసరించే నీతి, నిజాయితీ, విలువలు ఎలా ఉంటే అలాగే సమాజం కూడా ఫాలో అవుతుంది. అలా చూసినప్పుడు రాజకీయ విలువలు పూర్తిగా దిగజారిపోయాయి.

ఎన్నికలో గెలవడం కోసం డబ్బు, మద్యం పంపిణీ తోపాటు ఇతర ప్రలోభాలకు గురిచేయడం గెలుపే లక్ష్యంగా అడ్డదారులు తొక్కడం ప్రభుత్వాలను కాపడుకొడమే లక్ష్యంగా ఏ పనికైనా దిగజారడం ఇతరపార్టీలలో గెలిచిన వారిని తమ పార్టీలోకి లాక్కోవడం అందుకు డబ్బులు లేదా పెద్ద పెద్ద కాంట్రాక్ట్టులు ఇవ్వడం, అప్పటికీ లొంగకపోతే ఎదో ఒక అక్రమ కేసులో ఇరికించి లొంగదీసుకునే ప్రయత్నం చేయడం, సంపాదనే లక్ష్యంగా రాజకీయ నాయకులు పనిచేయడం, ప్రజా సేవ వదిలేయడం కేవలం గెలుపుకోసం కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం, కొన్ని అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడం, విలాసవంతమైన జీవితం కోసం వెంపర్లాడటం, అందుకోసం ఏ పనైనా చేయడానికి సిద్దం కావడం.

ప్రజలలో కూడా విలువలు దిగజారుతున్నయి. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కడం, విలాసవంతమైన జీవితంకోసం దేనికైనా తెగబడడం చేస్తున్నారు. ఒకనాడు రాజకీయాలు విలువలతో కూడినవి గా ఉండేవి బాధ్యతగా ఉండేవారు తన వలన తప్పు జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేసేవారు. ప్రజాసేవకు ప్రాధాన్యత ఇచ్చేవారు. సంపాదనే ముఖ్యంగా ఉండేది కాదు. పైగా కొందరు నాయకులైతే తమ సొంత ఆస్తులు కరిగించుకున్నారు రాజకీయాలలోకి వచ్చి. కానీ నేడు రాజకీయాలకు రావడం అంటే హంగూ ఆర్భాటం, పదవి, విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చు అనే ధోరణి కనపడుతుంది. ఇవ్వని సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. ఎన్నికలప్పుడు ఒకటి మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక ఒకటి మాట్లాడడం, ప్రతిపక్షం లో ఒకటి మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక ఒకటి చేయడం ఇలా నిత్యం ప్రజల కళ్ళెదుట జరుగుతుంటే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా..? అన్నట్లు పాలకులు, రాజకీయ నాయకులు చేస్తున్న చర్యల ప్రభావంతో ప్రజలకు కూడా అలవాటు అవుతున్నాయి. ఈ పరిణామాలకు కారకులు పాలకులు కాదా..? యధా రాజా.. తథా ప్రజా అన్న విధంగా ప్రస్తుతం సమాజం పొకడ ఉంది.

మన రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న పరిణామాలనే చూడండి… నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్మికుల మీద, సమ్మె మీద నిప్పులు చెరిగిన పాలకుడు నేడు వరాలు ప్రకటించాడు. ఎందుకు నాడు అలా.. నేడు ఇలా చేసాడు అంటే రాజకీయ మనుగడ కోసం. అదికాదు అనుకుంటే సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వారిని పిలిచి సమస్యలను పరిష్కరించే వారు. కార్మికులు లొంగితే ఒకటి లొంగకపోతే ఒకటి అన్న విధంగా ప్రభుత్వ పాలసీ ఉన్నప్పుడు అదే ప్రభావం అందరి మీద ఉంటుంది. చాలా ఈజీగా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం పాలకులే చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు ప్రజలు.

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అంటారు చేయరు, మీకు అదిచేస్తాం ఇది చేస్తాం అంటారు చేయరు. ఇలా నిత్యం రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడుతుంటే చూస్తున్న, వింటున్న ప్రజల మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో ఆలిచించుకొండి అంటున్నారు సామాజిక విశ్లేషకులు. అందుకే పాలకులు మారకుండా రాజకీయ నాయకులు మారకుండా ప్రజలు మారాలి అని వాళ్ళు చెప్పడం అంటే దయ్యలు వేదాలు వల్లించినట్ల్లు ఉంటుంది అంటున్నారు. ముందు పాలకుడు పారదర్శక పాలన అందించి నీతి నిజాయితీలతో ప్రజలకు సేవ చేస్తే సమాజంలో కూడా పరివర్తన వస్తుంది అంటున్నారు. రాజకీయాలు రాజకీయ నాయకులు దిగజారే కొద్ది సమాజం పై దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఇంకా ఘోరాలు నేరాలు పెరుగుతాయి. సామాన్యులకు రక్షణ కరువైతుంది …. తస్మాత్ జాగ్రత్త

Share on facebook
Share on twitter
Share on whatsapp