ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని సీఎం జగన్ అన్నారు. మంత్రి వర్గ సహచరున్ని కోల్పోవడం బాధకలిగించిందని, దాన్ని మాటల్లో చెప్పలేనని సీఎం అన్నారు. గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గౌతమ్ రెడ్డి మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపాన్ని వెలిబుచ్చారు. గౌతమ్ రెడ్డి సౌమ్యులు అని, పనిపట్లకు నిబద్దత కలిగిన గొప్ప నాయకుడు అని ట్వీట్ చేశారు.
గౌతమ్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రివర్గంలో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరించే వ్యక్తిగా గౌతమ్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. గౌతమ్ రెడ్డి ఆయన చివరి క్షణం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడ్డారని, అలాంటి సహచరున్ని కోల్పోవడం తీవ్రంగా బాధించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
పార్టీలతో సంబందం లేకుండా అందిరితోను గౌతమ్ రెడ్డి ఆప్యాయంగా కలిసి పోయేవారని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రిగా మంత్రిగా గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.