మార్చి 3న తెలంగాణలో 11 యూనివర్సిటీల విద్యార్థులను, ఉద్యమకారులను, మేధావులను మమేకం చేసి.. సంఘర్షణ సభ నిర్వహిస్తామన్నారు కేయూ విద్యార్థి సంఘాలు. శనివారం కేయూ విద్యార్థి సంఘాల జాక్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు.. ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శలు చేశారు.
యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులకు మంచి రోజులు రావాలనే ఉద్దేశ్యంతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగుల కోసం ప్రత్యేక ఎజెండా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సభ ద్వారా విద్యార్థి డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, మేధావులను, విద్యార్థి నిరుద్యోగులను, ఉద్యమకారులను ఈ సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలోనే కర పత్రం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పూర్తి ఎజెండాని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేయూ జాక్ ఛైర్మన్ తిరుపతి యాదవ్, PDSU రాష్ట్ర కార్యదర్శి విజయ్ కన్నా, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజునాయక్, టీజీవీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ రంజిత్ కుమార్, ABSF వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్, NSUI హన్మకొండ జిల్లా అధ్యక్షులు పల్లకొండ సతీష్, MSF కేయూ ఇన్ చార్జ్ ఓడపల్లి మధు, కేయూ NSUI ఎం.డి పాషా , BSF జిల్లా అధ్యక్షులు కాడపక రాజేందర్, BSF హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్, BSF కేయూ ఇన్ చార్జ్ కళ్ళపెళ్లి ప్రశాంత్, ABSF కేయూ ఇన్ చార్జ్ చెలుపూరి శ్రీకాంత్, కేయూ ఇన్ చార్జ్ సురేష్ నాయక్ గిరిజన శక్తి తదితరులు పాల్గొన్నారు.