ఉత్తరప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎన్నికలను వాయిదా వేసేది ఉండదని… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడారు.
అన్ని పార్టీలతో సమావేశమయ్యామని… ఎన్నికలు వాయిదా వేయొద్దని రాజకీయ పార్టీలు కోరాయన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం అని తెలిపారు. 11వేలకు పోలింగ్ కేంద్రాలను అదనంగా పెంచాం అన్నారు. 800 మహిళా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని ఈసీ వెల్లడించారు..