ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీని రాజకీయ పార్టీలాగే నడపాలని, కాంట్రాక్టర్ తో కాదని తీవ్రంగా మండిపడ్డారు.
నేను ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్‌లో బోర్డు ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌ల నియామకంపై నన్ను ఎప్పుడూ సంప్రదించలేదు. కానీ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ లో చాలా మందిని ఐప్యాక్ ( ప్రశాంత్ కిశోర్ కు చెందినది) నియమించింది. ప్రజలకు ఇప్పుడు ఇది వివరించడం చాలా కష్టంగా ఉంది.
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార క్యాంపెయిన్లు ఆయన నిర్వహించారు.
ముఖ్యంగా ఆయన నిర్వహించిన గవర్నమెంట్ ఎట్ డోర్ స్టెప్, బెంగాల్ వాంట్స్ ఇట్స్ డాటర్ అనే క్యాంపెయిన్లకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీనితోనే టీఎంసీ విజయం సాధించిందన్న విషయం అందరికి తెలిసిందే.