యూనివర్శిటీల్లో రాజకీయాలకు తావు లేదు. ఇది మన రాజకీయ నేతలు ఎప్పుడూ చెప్పే డైలాగు. అందుకే యూనివర్శిటీల్లో ఎన్నికలు కూడా రద్దు చేశారు. కానీ ఏపీలో ఇప్పుడు మళ్లీ యూనివర్శిటీలు రాజకీయాల కంపు కొట్టనున్నాయి. విద్యార్థి సంఘాల పేరిట ఉన్న రాజకీయాలు ఇప్పుడు నేరుగా ఎంటర్ కాబోతున్నట్లు కనపడుతోంది.
అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్శిటీలలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వైఎస్ విగ్రహాలను పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున యూనివర్శిటీలో వైఎస్ విగ్రహం పెట్టేయగా.. రాబోయే రోజుల్లో అన్ని యూనివర్శిటీల్లో ఇదే పరిస్థితి ఉండబోతున్నాయని తెలుస్తోంది.
దీనిపై మేధావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు యూనివర్శిటీల్లోకి మళ్లీ రాజకీయాలు తెచ్చి… గందరగోళం సృష్టించటం అవసరమా అని ప్రశ్నిస్తున్నాయి.