అసెంబ్లీ ఉన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తోంఉత్తరప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుది. రాజకీయ నేతలు నువ్వానేనా అన్నట్టు ప్రచారాలు చేస్తున్నారు. ఏ స్థానం నుంచి పోటీచేసేందుకైనా సిద్ధమేనంటూ తొలుత సవాళ్లు విసిరిన పలువురు సీనియర్ నేతలు.. ఇప్పుడు కాస్త మెత్తబడ్డట్టు అనిపిస్తోంది..! విజయంపై పూర్తి ధీమా ఉన్న సీట్ల నుంచే వారు బరిలో దిగుతున్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ బడా నేతలది ఇదే తీరు.
అదేబాటలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణం చేయనున్నారు. తనకు, తమ పార్టీకి గట్టి పట్టున్న గోరఖ్ పుర్ అర్బన్ స్థానం నుంచి పోటీకి సిద్దం అయ్యారు. ఈ నియోజకవర్గం జన్ సంఘ్ కాలం నుంచి కమలదళానికి పెట్టని కోట. 1980, 1985ల్లో మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి ఒక్కసారి మినహా మిగిలిన ఏడుసార్లు భాజపా అభ్యర్థులదే జయభేరి. తర్వాత పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయాయి. స్థానిక గోరక్ష పీఠాధిపతి మహంత్ అవేధ్యనాథ్ ఉత్తరాధికారిగా ఉన్న యోగి.. 2002లో ఈ స్థానంలో పిల్లల డాక్టర్ రాధామోహన్‌దాస్ అగర్వాల్ ను హిందూమహాసభ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. శుక్లాపై అగర్వాల్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి 2017 వరకు ఈ స్థానంలో అగర్వాల్ దే గెలుపు. ఈ నేపథ్యంలో భాజపాకు అత్యంత సురక్షిత స్థానంగా పేరున్న ఈ సీటు నుంచి పోటీకి యోగి సిద్ధమవుతున్నారు.
ఇటు.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మైన్ పురి లోక్ సభ పరిధిలోని కర్ హల్ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఎస్పీకి సురక్షిత సీటుగా దీనికి పేరుంది. 1993కు ముందు సోషలిస్ట్ పార్టీ, లోక్ దళ్, జనతాపార్టీ, జనతాదళ్ వంటి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత ఎస్పీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఈ స్థానంలో యాదవ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో.. ఇక్కడి నుంచి బాబూరాం యాదవ్ అత్యధికంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ సారి.. ఆ స్థానం నుండి అఖిలేశ్ యాదవ్ భరిలో దిగుతున్నారు.
మరోవైపు.. కౌశాంబీ జిల్లాలోని సిరాథూకు ప్రస్తుతం రాష్ట్రంలో వీఐపీ నియోజకవర్గంగా మారింది. డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో భాజపా అగ్రనేతల్లో ఒకరైన కేశవ్ ప్రసాద్ మౌర్య ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం. 2012లో ఆయన ఇక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఫూల్ పుర్ లో గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. 2017లో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఎమ్మెల్సీ పదవి చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగారు. అయితే.. ఆ తర్వాత మౌర్య లోక్ సభకు వెళ్లడంతో ఇక్కడ జరిగిన ఉపఎన్నికలో ఎస్పీ అభ్యర్థి వాచస్పతి గెలుపొందారు. 2017 ఎన్నికల్లో సిరాథూలో భాజపా అభ్యర్థి సీతల్ ప్రసాద్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. ఆ స్థానం నుండి కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేసి.. రికార్డ్ మెజార్టీపై కన్నేసిట్టు తెలుస్తోంది.