దేశంలో ప్రస్తుత పరిస్థితులు బాగా లేవని బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. కోల్ కతాలోని రెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో ఆమె పాల్గొ్న్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె…
దేశంలో విభజించు పాలించు అనే రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు. అవి దేశానికి మంచివి కావన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి ప్రజలు భయపడవద్దన్నారు.
త్వరలోనే ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయని ఆమె అన్నారు. మెరుగైన భవిష్యత్ కోసం మనమందరం కలిసిపోరాడుదామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజలకు బాధకలిగించే విధంగా తాను గానీ తన పార్టీ కార్యకర్తలు గానీ తన ప్రభుత్వం కానీ ప్రవర్తించదని వివరించారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని వివరించారు.