నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
దాదాపు 70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించడానికి ప్రయత్నించిన కొందరిని పోలీసులు అడ్డుకుని పంపిచేశారని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో 82 శాతం పోలింగ్ జరిగింది.. ఉప ఎన్నికల్లో సహజంగానే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందన్నారు. ఏడు చోట్ల ఈవీఎంలు, మరో చోట వీవీ ప్యాడుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. సమస్యను పరిష్కారం చేసి సజావుగా ఎన్నికలు నిర్వహించమని తెలిపారు.
ఈవీఎంలు, వీవీ ప్యాడులను ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.