ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పోలింగ్ ప్రారంభమైన మొదట్లో ఓటు హక్కును వినియోగించేందుకు ప్రజలు తక్కువ సంఖ్యలో వచ్చిన.. సమయం పెరిగే కొద్దీ ఓటు వేసేందుకు జనాలు భారీగా వస్తున్నారు. ఢీల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేసిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి పోటీ ఇస్తుండటంతో ఈసారి ఎవరు అధికారంలోకి రానున్నారని అంత చర్చిస్తున్నారు. మొత్తం 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు 13,750 పోలింగ్ కేంద్రాలున్నాయి. శనివారం పోలింగ్ ముగిశాక ఫలితాలను 11న వెల్లడించనున్నారు.