నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు నేడు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించినున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.
కేంద్ర మంత్రులు నిర్మలా సీతా రామన్, పీయూష్ గోయెల్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, జయరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేన సంజయ్ రౌత్ లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవల 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. ఇందులో యూపీ, తమిళనాడు, బీహార్, ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లో మొత్తం 41 మంది ఎన్నిక ఏకగ్రీవం అయింంది. మిగిలిన 16 స్థానాలకు నేడు ఎన్నికలను నిర్వహిస్తున్నారు.