కొడుకు అల్లు అర్జున్ హిట్ కోసం ప్రిన్స్ మహేష్‌ను అల్లు అరవింద్ బలి చేశాడా..? అనే చర్చ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా వినపడుతోంది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం లో సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో… ఈసారి సంక్రాంతి పోరు ఆసక్తిగా ఉంది. అయితే రెండు భారీ సినిమాలు ఒకే రోజు అంటే నిర్మాతలు బయపడిపోయినట్లున్నారు… ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశమై సినిమాల రిలీజ్ పై చర్చించింది.
దీంతో మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు ఓ రోజు ముందుగా అంటే జనవరి 11నే రిలీజ్ కాబోతుంది. అందుకు ఆ చిత్ర నిర్మాత ఒకే చెప్పారు. కానీ ఇక్కడే నిర్మాత అల్లు అరవింద్ తన చాతుర్యాన్ని వాడినట్లు సినిమా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు జనవరి 11న రిలీజ్ అయితే అవేవీ హిట్ అయిన దాఖలాలు లేవు. కానీ జనవరి 12న రిలీజ్ అయిన చిత్రాలు మాత్రం బ్లాక్ బాస్టర్ అయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ గ్రహించే అల్లు అరవింద్ చక్రం తిప్పినట్లే కనపడుతోందంటున్నారు.
అల్లు అరవింద్ దెబ్బకు మహేష్ బలైనట్లే అంటూ… ఈసారి తెలిసిపోతుంది జనవరి 11 మహాత్యం అంటున్నారు.