తెలంగాణ బీఆర్ఎస్ లో ఎన్నికల ముందే లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే వైరా నియోజకవర్గం నుంచి నేతలు వైరానికి దిగుతున్నారు. సోమవారం పొంగులేటి వర్గీయులు నిర్వహించిన బైక్ ర్యాలీతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. బీఆర్ ఎస్ పార్టీని పొంగులేటి వ్యతిరేకించడంతో ఆయన వెంట వెళ్లిన 20 మందిని పార్టీ బహిష్కరించింది.
అయితే పొంగులేటి వెంట వెళ్లిన నేతల వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదని బీఆర్‌ఎస్ భావించింది. అయితే ప్రస్తుతం వైరా ఎమ్మెల్యే అనుచరులుగా కొనసాగుతున్న వారు కూడా పొంగులేటి వెంట వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలోనే పొంగులేటి వర్గీయులు బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైరాలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో సుమారు 600 మంది వైరా మండల ద్విచక్ర వాహన దారులు, కొణిజర్ల మండలం నుంచి 200 మంది ద్విచక్ర వాహనదారులు మొత్తంగా 800 మంది బైక్ లతో స్వచ్ఛంధంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీకి కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంధంగా తరలి రావడం విశేషం. వారికి ఎటువంటి నగదు ఇవ్వకపోగా.. కనీసం పెట్రోలు కూడా పొంగులేటి వర్గీయులు పోయించలేదు. దీంతో బీఆర్ ఎస్ నాయకులకు వణకు మొదలైంది. ఎందుకంటే 5 గురే అనుకుంటే ఇప్పుడు ఇంతమంది స్వచ్ఛంధంగా పాల్గొవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది.
దీంతో అధికార పక్ష నాయకులు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనుకుంటూ తలలు పట్టుకుని కూర్చున్నారు.