Advertisements
పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు
రైతుల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం ఆహ్వానించ దగ్గ పరిణామం.భారత్ బంద్ కు టిఆర్ఎస్ మద్దతు .. మరో కొత్త నాటకం. ఇన్ని రోజులు మోదీ సర్కార్ కు మద్దతు ఇస్తూ వచ్చిన కేసీఆర్ .. ఇప్పుడు రైతులను దగా చేసేందుకే బంద్ కు మద్దతు ఇస్తున్నాడు. వ్యవసాయ బిల్లును వ్యతిరేకించే చిత్తశుద్ది ఉంటే .. అసెంబ్లీ లో ఎందుకు తీర్మానం చేయలేదు . అసెంబ్లీ లో తీర్మానం చేస్తే .. మోదీ తనకు సంకెళ్లు వేసి జైల్లో పెడతారని భయం కేసీఆర్ కు ఉంది.
ఇన్నిరోజులు మోదీ ప్రజా వ్యతిరేక చర్యలపై మద్దతు ఇచ్చి .. ఇప్పుడు బంద్ కు మద్దతు పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలు వస్తే .. ఎపుడైనా కేసీఆర్ సర్కార్ రైతులను ఆదుకున్నారా ..? కౌలు రైతులకు ఎందుకు రైతుబందు ఇవ్వడం లేదు . రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు .నియంతృత్వ వ్యవసాయంతో రైతులను ఇబ్బందుల పాలు చేసింది కేసీఆర్ కాదా ..సన్న వడ్ల కు మద్దతు ధర ఇవ్వకుండా రైతులకు నష్టం కలిగించింది కేసీఆర్ కాదా…బంద్ లో నైనా మీరు నాయకులు క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు చూడండి. రాష్ట్రంలో రైతులను మోసగించి .. దేశ రైతులకు మద్దతు ఇవ్వడం విడ్డూరం .