పొన్నాల లక్ష్మయ్య
మాజీ టీపీసీసీ
అధ్యక్షుడు..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం…
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సుధీర్ఘ సమాలోచనలు, మంత్రిమండలి సమావేశం తర్వాతచాలా విషయాలు చెప్పారు. కరోనా విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పనిచేయటం లేదన్నది, పేదల పట్ల, వలస కార్మికుల పట్ల, అవలింబించిన విదానం ఏమాత్రం ఆశించినరీతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏడులక్షలని చెప్పారు. అరవైవేల మందిని మాత్రమే పంపారు. మిగతా వారి ప్రస్థావన లేదు. వారి స్థితిగతుల గురించి పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల రూపాయల పధకం, ఏమి పధకం, ఏం వస్తుంది, రాష్ట్రానికి ఏమీ రాదంటున్నాడు. డీ-మానిటేషన్ అప్పుడు కూడా ఇలాగ మాట్లాడి, డిల్లీకి వెళ్లి వచ్చాక మాట మార్చాడు.
జీఎస్టీ విషయంలో కూడా హైదరాబాద్ లో ఒకమాట, డిల్లీలో ఒకమాట మాట్లాడాడు. ఇరవై లక్షల కోట్ల రూపాయల పధకం వల్ల పేదలకు, వలస కార్మికులకు ఉపయోగం లేదని కాంగ్రెస్ మీకంటే ముందే చెప్పింది. ఈయనకు మాత్రం అప్పులు తీసుకునే అవకాశం మాత్రం వచ్చింది. అప్పులు ఏరకంగా వాడదామన్న దాంట్లో ప్రాధాన్యతలు లేవు. మసిపూసి మారేడుకాయ చేసేందుకు, ఈ కష్టకాలంలో ఏంచేయాలో చెప్పకుండా, వ్యవసాయ రంగం గురించి సుధీర్ఘంగా మాట్లాడాడు.
కేసీఆర్ గారు… ఒక్కమాట అడుగుతాను,
మీరు #మిషన్ కాకతీయ అన్నారు.
ఇరవైనాలుగు గంటల కరెంట్ అన్నారు.
ఒక్క నీటి చుక్క రాకున్నా కాళేశ్వరం గొప్పదన్నారు.
గత ప్రభుత్వాల పనితనంతో చేసినవే ముందుకు తీసుకుపోకుండా, అదనంగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. మీరు చెప్పనవి ఏవీ లేకుండా 2013-14 లో కోటి ఏడు లక్షల నలబై అయిదు వేల టన్నుల ఆహార ధాన్యాలను పండించింది వాస్తవం కాదా?
గత సంవత్సరం వరకు మీ ఇరిగేషన్ స్టాటజీ వల్ల, మిషన్ కాకతీయ & 24 గంటల కరెంటు వల్ల
మీ గొప్పతనం వల్ల ఎందుకు అధిగమించ లేదు ?
మక్కలు కాకుండా కందులు అంటున్నారు
వరి నలభై లక్షలే అంటున్నాడు.
పత్తి డెబ్బయ్ లక్షలు అంటున్నాడు.
ఇప్పటి వరకు సేకరించిన కందులకు మూడు నెలలైనా డబ్బులే ఇవ్వలేదు.
గోడౌన్లను ముందుగా ఎగుమతి చేసి, ఎందుకు ప్రణాళికతో కాళీ చేయలేదు,
గోనె సంచుల కొరత చూపడమేంది?
నలభైరోజులు అయినా డబ్బులు అందకపోవడం ఏంది? ఎర్రవెల్లిని మాడల్ విలేజీ అన్నారు. వారిని సోయాబిన్ వేయమన్నారు. ఈయన మాట నమ్మి సోయాబిన్ వేస్తే, కొనుగోలు లేక, గిట్టుబాటు రాక ఇబ్బందులు ఎదురవ్వడంతో, తిరిగి మీ ఇష్టమున్న పంట వేసుకొమ్మన్నారు. మీ మాటకు విలువలేదు. విశ్వాసం లేదు.
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం. వారికి ఏపంట ఎప్పుడు వేసుకోవాలో తెలియదా?
నీ ఉపదేశం వింటే గతంలో లాగే రైతులు నిండా మునుగుతారు. మీరు ఎకరానికి కోటి సంపాదిస్తున్నారు కదా! ఆ కిటుకు ఆరేళ్లుగా రైతులకు ఎందుకు చెప్పలేదు?
ఎందుకు కాలయాపన చేస్తూ…
మాయామాటలు చెబుతారు. బేసిన్లు – భేషజాలు అక్కరలేదని ఇవాళ చెబుతున్నావు. వరదజలాలను హక్కుగా మార్చుకొని 2004 వరకు శ్రీశైలంలో నీల్ల తో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకోబడ కుండా, కరువు ప్రాంతాలైన మహబూబ్ నగర్, నల్గొండకు అదేవిధంగా రాయలసీమకు ఎక్కుడా వివాదం లేకుండా చేస్తే, పోతిరెడ్డిపాడును సెంటిమెంట్ గా తీర్చిదిద్ది, అన్యాయం జరుగుతుందని చిత్రీకరించి, గగ్గోలు పెట్టి, తెలంగాణ ఉద్యమంలో వాడుకుని, ఇప్పుడేమో ఆ రాష్ట్రాలతోని కలసి పని చేద్దామంటావా? అప్పుడేమో వ్యతిరేకించి ఇప్పుడేమో విశాలహృదయంతో కలిసి పనిచేద్దామంటున్నావా?
భవిష్యత్’లో వివాదాలు, తగాదాలు, రాకుండా ఉండటానికి నిఖర జలాలు వాడుకోకుండా ఉండటానికి తలపెట్టిన దుమ్ముగూడెం టేల్’పాండ్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? పరిపక్వత లెని, ఏకపక్షంగా బేసన్లు-భేషజాలు అని మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒకమాట, ఇప్పుడు ఒకమాటగా,
దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నావు. వరదజలాలు వచ్చే ప్రాజెక్టులు పూర్తిచేస్తే, ఈరోజు నల్గొండకు గ్రావటీ ద్వారా వచ్చే నీళ్లు గానీ, మహబూబ్ నగర్లో నాలుగు ప్రాజెక్టులు పూర్తి చేసుంటే, దాదాపు పదకొండు లక్షల ఎకరాలకు నీరొచ్చేది. పెండింగ్ ప్రాజెక్టులలో తట్టెడు మట్టి తీసావా? అదనంగా ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చావా? గతంలో నిర్మించిన జలాశయాల్లోకి నీళ్లు నింపి, వాటి ద్వారా చెరువులు నింపి ఏదో కాళేశ్వరం నీళ్లని భ్రమలు పెట్టి, డప్పులు కొట్టి చెప్పుకునే ప్రచారం తప్ప ఏమీలేదు. అందుకే ఇప్పటికైనా పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తే, తెలంగాణ రైతులకు ఇతోధికంగా మేలు జరుగుతోందని తెలియచేస్తున్నాను. అధికారం కోసం, కుయుక్తులు, మోసపుమాటలు, ఇకచాలు..ఏ ఒక్క మాట మీద నిలబడని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మీరే…
కేసీఆర్ గారు… గత మార్చిలో ఏం చెప్పావు? ఇప్పుడు ఏం చెబుతున్నావు? ఈ కరోనా సమయంలో అప్రధాన్యతా రంగాలకు, ఏ చెల్లింపులు చేసావో చెప్పు? సీఎం రిలీఫ్ ఫండ్ దేనికోసం ఖర్చు పెట్టావో చెప్పు? అందుకే నీ మాటలు కట్టిపెట్టు, పేద ప్రజలకు అండగా ఉండు…