ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ దొంగలేనని విమర్శించారు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్యయ్య. ఈయన ప్రాణం ఆయన గుప్పిట్లో ఉందని కేసులకు భయపడి బీజేపీ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. 2014 నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో ప్రజలకు ఒరిగింది లేదని విమర్శించారు.
తన నియోజకవర్గంలో సరస్వతి వేడుకల కోసం కోట్ల రూపాయలతో భవనాన్ని ప్రారంభించారని.. ఇప్పుడు అందులో కార్యక్రమం జరపలేదని ఆరోపించారు పొన్నాల. విద్యుత్ బిల్లుల బాకీలతో అది వివాహ వేదికగా మారిందని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం లేదని అన్నారు.
మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం ఇవ్వలేదన్నారు పొన్నాల.
భూముల రేట్లు పెంచుతున్నప్పుడు గత పరిహారం ఇవ్వాలి కదా? అని నిలదీశారు. దోచుకోవడానికి, దాచుకోవడానికి రాజకీయ ఎత్తుగడలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి కేసీఆర్ చేసిందేం లేదని విమర్శించారు. అసలు.. కేసీఆర్ తీరు చూస్తుంటే తెలంగాణ వ్యక్తేనా అనే అనుమానం వస్తోందని అన్నారు. బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడందే ఆయన మనుగడ సాగదంటూ విమర్శలు చేశారు పొన్నాల.