పొన్నాల లక్ష్మయ్య
సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. నిన్న పంపులు స్టార్ట్ చేసి .. పది టీఎంసీల నీటిని ఎత్తి పోస్తామంటున్నారు. జనాన్ని నమ్మించడం కోసం తూతూ మంత్రంగా నీటిని పంపింగ్ చేస్తున్నారు. కాళేశ్వరం.. అవసరమని నమ్మించేందుకు దౌర్భాగ్యపు పనులు చేస్తున్నారు. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు లలో పూర్తిస్థాయిలో నీరు ఉంది. ఇప్పుడు కాళేశ్వరం నీరు అవసరమా..కేవలం ప్రాజెక్టు కట్టామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సామాన్య ప్రజలను నమ్మించడానికి అవసరం లేకపోయిన పంపింగ్ చేస్తున్నారు. మూడేళ్లుగా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్కనీరు ఉపయోగపడలేదు. కాళేశ్వరం అవినీతిని నిరూపిస్తా.. నాతో చర్చకు రావాలి. గణాంకాలతో నిరూపిస్తా.. కేసీఆర్ అవినీతి బయట పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే ఉంటది.
కాళేశ్వరం ప్రాజెక్టు తో భూ గర్భ జలాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 16 టీఎంసీ ల నీరుకే భూ గర్భ జలాలు పెరిగితే మరి నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు ల కింద ఎంత భూ గర్భ జలాలు పెరుగుతాయి. వనపర్తి, సంగారెడ్డి ప్రాంతాలలో భూ గర్భ జలాలు బాగా పెరిగాయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందా. అబద్దాలతో కాలం గడిపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేసీఆర్, మోడీ ఎందుకు వేసుకోవడం లేదు. ప్రపంచంలో వ్యాక్సిన్ విషయంలో చాలా సాధించామని చెప్పుకుంటున్న మోడీ మరి మొదటి వ్యాక్సిన్ వేసుకొని ఎందుకు ప్రజలకు భరోసా ఇవ్వడం లేదు. ప్రపంచంలో చాలా మంది దేశాధ్యక్షులు, ముక్యులు మొదటి బాక్సీన్ వేసుకొని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ఇక్కడ మోడీ మాత్రం ప్రజలకు ఏవేవో చెప్పి దాటవేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఒకే రోజు కోట్ల మందికి పోలియో చుక్కలు వేసి రికార్డ్ సృష్టించాము. అది గుర్తుందా.