పొన్నాల లక్ష్మయ్య మాజీ పీసీసీ అధ్యక్షులు
తుగ్లక్ ఏం పుణ్యం చేసిండో కానీ ఈ కేసీఆర్ చేసే పనులకు ప్రతిరోజు ఆయనను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చడు. చేసిన ఒక్క పని సక్కగా చేయడు. ప్రతిపక్షాలు, వద్దు అంటున్న మొండిగా పోతాడు బోల్తా పడతాడు. అహం, తెలివితక్కువ తనం, అనుభవ లోపం, పరిపాలనపై పట్టు లేకపోవడం లాంటి వాటితో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి పనిలో లోపాలు.. ఇప్పుడు తాజాగా నియంత్రణ సాగు. వద్దు సారు అంటే వినలేదు.. ఇప్పుడు యూ టర్న్ కారు గా మిగిలిపోయిండు. మిషన్ భగీరథ అంతే 48 వేల కోట్లు అప్పులు తెచ్చి మరీ పెట్టారు. ఒక్కడన్న ఆ నీళ్లు తగుతున్నారా.. గిన్నెలు కడుక్కోవడానికి, బట్టలు ఉతకడానికి, స్నానాలకు వాడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంతే లక్షకోట్లు ఖర్చు చేశారు. ఒక్క చుక్క అయిన వాడుకున్నమా..సచివాలయం కూల్చేశారు. వద్దు అంటే వినలేదు. మెట్రో రైల్ కోసం ఏదేదో చెప్పి మూడేళ్లు ఆలస్యం చేసి 4 వేల కోట్లు భారం మోపాడు. తెలంగాణ లో ఇప్పుడు ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల ఎత్తివేత. గతంలో రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు రైతులకు మొండి చెయ్యి చూపించాడు. కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలకు అనుకూలంగా నిర్ణయం ఉన్నట్టుంది. ధరణి వెబ్ సైట్ తప్పుల తడకలతో రైతులకు గందరగోళంగా మారింది. ఇప్పటికే తమ భూమి రికార్డ్ లో లేదని కొంతమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎల్ ఆర్ ఎస్ విషయం లో కూడా తీవ్ర గందరగోళం. సీఎం కేసీఆర్ అవివేకం, అహంకారం, అనాలోచిత నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారు. కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుంది. కేసీఆర్ కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయం.
మిషన్ భగీరథకు 50 వేల కోట్లు ఖర్చు చేశావు.. నీళ్లు ఇచ్చావా..కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేశారు. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్ర ద్రోహి గా మిగిలిపోతారు. కేసీఆర్ తీసుకునే 90శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని .. ప్రజల్లో ఎండగడతాం. కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలు లోనే ఉంటుంది.