పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ
వర్షాల సీజన్ ప్రారంభమైనా.. ఇంకా ధాన్యం కల్లాలలోనే ఉంది. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలి. సత్వరమే రైతుబంధు నిధులు రైతుల అకౌంట్లలో జమచేయాలి.
రైతుల పొట్టగొట్టోద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా. వరంగల్ డిక్లరేషన్ రైతులను రాజు చేస్తుంది. గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది.
వరి వేసుకుంటే సిరి అని మేం చెబుతున్నాం. రైతుల జీవితాలతో బీజేపీ, టీఆర్ఎస్ చెలగాటమాడుతున్నాయి. హరీష్ రావు మాటలు తప్ప హుజూరాబాద్ ప్రజలకు ఓరిగిందేమి లేదు.
లక్ష ఎకరాలకు పైగా పారే గౌరవెళ్లి, గండిపల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్ జరగాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించవద్దు. అన్నదాతల పొట్టకొట్టొద్దు. చరిత్రహీనులుగా మారవద్దు.