పొన్నం ప్రభాకర్.. కాంగ్రెస్ సీనియర్ నేత
తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన చిన్న ముల్కనూర్ లోనే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ 40 కిలోల బస్తాపై రెండున్నర కిలోల ధాన్యాన్ని అదనంగా తరుగు తీస్తున్నారు. వాన పడితే పంట మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు అయిష్టంగానే తరుగు తీసేందుకు ఒప్పుకుంటున్నారు.
రైస్ మిల్లుకు వెళ్లిన తర్వాత మళ్లీ ప్రతీ ట్రాక్టర్ లోడ్ పై మూడు క్వింటాళ్ల కోత విధిస్తున్నారు. ఒక కిలో ఎక్కువ కోత పెట్టినా.. రైస్ మిల్లులను సీజ్ చేస్తామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ ఇక్కడికి వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ.. మిల్లులను సీజ్ చేసే ధైర్యం గంగులకు ఉందా..? మాటలు చెప్పడం కాదు. చేతల్లో నిరూపించుకోవాలి.
సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా రైతుల పరిస్థితి ఏంటి..?. ధాన్యం కొనుగోళ్ల విషయమై స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదట. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. నీ నియోజకవర్గంలోని రైతులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనప్పుడు నువ్ ఉండి ఎందుకు.. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్.
మరోవైపు కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ రైతుల సమస్యలు పట్టించుకోకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాడు. లేదంటే వేములవాడకు వెళ్లి ఫాజుల్ నగర్ పేరును శ్రీరామ్ నగర్ గా మార్చమంటున్నాడు. నీవు ఏమైనా మార్చుకో కానీ.. ముందుగా రైతుల సమస్యలు పట్టించుకో.