ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలో కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఆర్టీసీని కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని, కేసీఆర్ వైఖరి వల్లే కార్మికులు సమ్మెకు వెళ్లారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసిన ఆయన, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేటీఆర్ హుజూర్‌నగర్‌లో ఎలా ఓట్లడుగుతారని ప్రశ్నించారు.