ఆయన సినిమాలో చిన్న పాత్రచేసినా చాలు, జన్మధన్యం అని నటులు ఫీలయ్యే దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యం.ఎంత పెద్దహీరోతో చేసినా,ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా.
కమర్షియల్ కాంప్రమైజులు ఆయన సినిమాల్లో ఉండవ్. ఇమేజ్ లు స్టార్డమ్ లు ఆయన సినిమాల్లో కనిపించవు. పాత్రలు కనిపిస్తాయి. కథే హీరోగా నడిపిస్తు. గొప్పసినిమా చూసామన్న అనుభూతిని ప్రేక్షకుడికి అందిస్తుంది.
తాజాగా ‘పొన్నియన్ సెల్వన్’ (PS1 )అనే సినిమాతో ఆయన జోనర్ కాని జోనర్ ని టచ్ చేసారు. అక్టోబర్ 30వ తేదీన విడుదలైన ఈ చిత్రం. అంచనాలను మించకపోయినా చిత్రీకరణ, సంగీతం, దర్శకత్వం, గెటప్స్, నేపథ్యం లాంటి పలు అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
కాగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 కూడా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్..వచ్చే యేడాది ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్లు మాసివ్ అప్డేట్ అందించారు.