- ‘పొన్నియన్ సెల్వన్’ త్రిష ఫస్ట్‌లుక్ రిలీజ్
- నగలు, కళ్లలో రాజసం ఉట్టిపడేలా స్టిల్.
- సినిమా విడుదలపై ప్రేక్షకుల క్యూరియాసిటీ
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ వరుస అప్ డేట్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మూవీ సెప్టెంబరు 30న విడుదల కానుండటంతో ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేందుకు చిత్రబృందం ప్రధాన నటీనటుల పోస్టర్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని త్రిష ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ క్రమంలో ఇప్పటికే విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయగా.. తాజాగా త్రిషకు సంబంధించిన యువరాణి ‘కుందవాయి’ క్యారెక్టర్ పోస్టర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన లైకా ప్రొడక్షన్స్.. ‘పురుషుల ప్రపంచంలో ధైర్యం ఉన్న స్త్రీ. యువరాణి కుందవాయిని పరిచయం చేస్తున్నామని తెలిపారు.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో త్రిష ఒంటినిండా నగలతో అత్యంత సౌందర్యంతో రవివర్మ గీసిన పేయింటింగ్‌లా మెరిసిపోతోంది. ఈ పోస్టర్ త్రిష అభిమానులను ఫిదా చేస్తోంది. ఇటీవలే విడుదలై ఐశ్వర్యరాయ్, కార్తి, విక్రమ్‌ల ఫస్ట్‌లుక్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
కాగా చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ఈ సినిమా టీజర్ జూలై 7న తంజావూరులోని బృహదేశ్వరా టెంపుల్‌లో విడుదల చేయనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.