ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య సఖ్యత లేదు. అవును ఇదే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇక ఇదే విషయమై పూజాను ప్రశ్నించగా సరైన సమాధానం ఇచ్చింది.
ప్రభాస్ చాలా మంచి వ్యక్తి. నిజానికి, అతను నాకు మా అమ్మకు ఇంట్లో తయారుచేసిన ఫుడ్ పంపేవాడు. అతనితో కలిసి పని చేయడం చాలా ఆనందకరమైన అనుభవం. దీనికి విరుద్ధంగా వస్తున్న వార్తలు నిరాధారమైనవి అంటూ చెప్పుకొచ్చింది.
పూజా చేసిన ఈ వ్యాఖ్యలు… వారి మధ్య సఖ్యత లేదనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది. ఇక ఈ ఇద్దరూ నటించిన రాధే శ్యామ్ మార్చి 11న థియేటర్లలోకి రానుంది.
ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్ నటిస్తుండగా…. ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తుంది. పరమహంస గా కృష్ణం రాజు నటిస్తున్నారు.