పూజా హెగ్డే.. పాన్ ఇండియా హీరోయిన్. వరుసపెట్టి సినిమాలు, ఎడతెగని షూటింగులు, రెస్ట్ తీసుకోవడానికి కూడా టైమ్ ఉండదు, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ ముద్దుగుమ్మ గురించి ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడంత సీన్ లేదు. ఉన్నట్టుండి సడెన్ గా ఖాళీ అయిపోయింది ఈ బ్యూటీ.
అవును.. పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే సడెన్ గా ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమా లేదు. కొత్త అవకాశాల కోసం ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. స్టార్ హీరోయిన్ పూజాకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
మొన్నటివరకు బిజీగానే ఉంది పూజా. చేతిలో కనీసం 2-3 సినిమాలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆమె చేస్తున్న హిందీ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా ఆమె చేయాల్సిన జనగణమన సినిమా ఆగిపోయింది. అటు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.
దీంతో పూజాహెగ్డే ఖాళీ అయిపోయింది. మంచి ఆఫర్లు వస్తే కాల్షీట్లు కేటాయించడానికి ఆమె సిద్ధంగా ఉంది. నిజంగా మిడ్ రేంజ్ హీరోలకు ఇదొక మంచి అవకాశం. మంచి బ్యానర్, భారీ పారితోషికం సెట్ చేసుకుంటే.. పూజాహెగ్డేను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవచ్చు.