తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో, అరవింద సమేత సినిమాలు చేసిన పూజా… ఇప్పుడు మరో సినిమా చేయబోతుంది.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఎన్టీఆర్… ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్‌తో జతకట్టనున్నారు. దీంతో ఇప్పటికే కథను ఫైనల్ చేయటంలో బిజీగా ఉన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్.
అయితే, పూజా హెగ్డే నటన, తన కమిట్‌మెంట్ విషయంతో త్రివిక్రమ్ మరోసారి ఎన్టీఆర్ సినిమాలో ఆమెకే ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అయితే… ఈ విషయంపై ఎన్టీఆర్‌తో ఓ మాట చెప్పి ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మిగతా నటీనటులను ఫైనల్ చేయాల్సి ఉంది.
హరిక హసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. 2021 వేసవిలో ఈ సినిమా రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉందట చిత్ర యూనిట్.
Advertisements