ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ అలా వైకుంఠ పురములో. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం విడుదలై బుధవారానికి రెండేళ్లయింది. ఈ సందర్భంగా పూజ హెగ్డే ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పూజా హెగ్డే, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ డాన్స్ చేస్తూ కనిపించారు. లొకేషన్‌లో నెక్స్ట్ షాట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ వీడియోను తీసినట్టు పూజా తెలిపింది.
ఇక పూజా సినిమాల విషయానికొస్తే రాధే శ్యామ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది. అలాగే ఆచార్య సినిమా కూడా లో పూజా హెగ్డే నటించింది.
Advertisements